గెలిస్తే ఓ లెక్క.. ఓడితే మరోలెక్క.. నివురుగప్పిన నిప్పులా ఏపీ మారిందా?

కౌంటింగ్‌ సమయం దగ్గరపడేకొద్దీ ఏపీలోని ప్రజల్లో బీపీ క్రమంగా పెరుగుతోంది. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అంచనాలకు అందని విధంగా ఓటింగ్‌ సరళి కనిపిస్తోంది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి.. మరెవరికి ప్రతికూలంగా ఉంటాయన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

గెలిస్తే ఓ లెక్క.. ఓడితే మరోలెక్క.. నివురుగప్పిన నిప్పులా ఏపీ మారిందా?

|

Updated on: May 25, 2024 | 7:48 PM

కౌంటింగ్‌ సమయం దగ్గరపడేకొద్దీ ఏపీలోని ప్రజల్లో బీపీ క్రమంగా పెరుగుతోంది. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అంచనాలకు అందని విధంగా ఓటింగ్‌ సరళి కనిపిస్తోంది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి.. మరెవరికి ప్రతికూలంగా ఉంటాయన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీంతో అటు ప్రజల్లో.. ఇటు కేడర్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీలు మాత్రం మేకపోతు గాంబీర్యంతో స్వీప్‌ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అప్పుడే ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేశాయి. గెలుపోటముల సంగతి అలా ఉంటే.. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. ఇక కౌంటింగ్‌ రోజు కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘానికి వచ్చిన ఇంటిలిజెన్స్‌ నివేదికలు యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 469 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మరీ కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా 276 ప్రదేశాల్లో తనిఖీలు చేశారు. రిజల్ట్‌ రోజున బాణసంచా కాల్చటం ,ర్యాలీలు చేయడంపై ఇప్పటికే నిషేధం విధించారు. అటు 24 కౌంటింగ్‌ కేంద్రాలకు అదనపు అధికారులను కూడా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధికారులతో నిరంతరం రివ్యూ చేస్తూ భద్రతను సమీక్షిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. 25 పారా మిలటరీ బలగాలను ఇప్పటికే కొనసాగిస్తోంది. ఇంతా చేస్తున్నా కౌంటింగ్‌ డే ప్రశాంతంగా ఉంటుందా.. ?

Follow us