Lifestyle: జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి

గాలిలోని కాలుష్య కారకాలు జుట్టుకు, మాడుకు అంటుకుపోయి దురద, చిరాకు కలగజేస్తాయి. ఇవి తేమను లాగేసుకొని జుట్టు పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు కళ తప్పుతుందని, వెంట్రుకలు రాలుతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రోజులో ఎక్కువసేపు బయట తిరిగేవారికి వెంట్రుకలు పెళుసుబారి తేలికగా విరిగిపోతాయని చెబుతున్నారు. అలాగే హెల్మెట్స్‌ ధరించే...

Lifestyle: జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి
Hair Fall
Follow us

|

Updated on: May 26, 2024 | 2:23 PM

జుట్టు రాలడం.. వినడానికి చిన్న సమస్యే అయినా, ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి మాత్రం ఇదో పెద్ద సమస్య. ఇటీవలి కాలంలో జుట్ట రాలడం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జల కాలుష్యం కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతోంది. అయితే వాయు కాలుష్యంగా కూడా వెంట్రుకలు దెబ్బతినడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గాలిలోని కాలుష్య కారకాలు జుట్టుకు, మాడుకు అంటుకుపోయి దురద, చిరాకు కలగజేస్తాయి. ఇవి తేమను లాగేసుకొని జుట్టు పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు కళ తప్పుతుందని, వెంట్రుకలు రాలుతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రోజులో ఎక్కువసేపు బయట తిరిగేవారికి వెంట్రుకలు పెళుసుబారి తేలికగా విరిగిపోతాయని చెబుతున్నారు. అలాగే హెల్మెట్స్‌ ధరించే వారికి కూడా ఈ సమస్య వేధిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా ఈ కాలుష్యం ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కచ్చితంగా బయటకు వెళ్లేముందు తలకు క్యాప్‌ను ధరించడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కర్ఛీఫ్‌ అయినా తలకు చుట్టుకోవాలి. దీనివల్ల కాలుష్యం ప్రభావం కొంతమేరైనా తగ్గుతుంది.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో తడి జుట్టుతో బయటకు వెళ్లకూడదు. తడికి దుమ్ము ధూళి అంటుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల పూర్తిగా ఆరిన తర్వాతే బయటకు వెళ్లాలి.

* మహిళలు జుట్టును గాలికి వదిలేయడం ఇటీవల ఓ ట్రెండ్ అయితే. ఇలా చేస్తే కూడా కాలుష్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంఉకే వీలైనంత వరకు తలకు దగ్గరగా ముడివేసుకోవాలి. అలాగని రబ్బరుబ్యాండ్ల వంటి వాటితో మరీ గట్టిగా బిగించకూడదు.

* వారానికి ఒకసారి షాంపూతో తలస్నానం చేశాక జట్టుకు ఆవిరి పడితే మాడు మీది సూక్ష్మ రంధ్రాలు తెరచుకొని వాటిల్లో చిక్కుకున్న కాలుష్య కారకాలు తేలికగా బయటకు వచ్చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.

* తేనె, పెరుగు, వెనిగర్ వంటి వాటిని మిక్స్ చేసి వెంట్రుకలు పట్టించి, కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్ట బలంగా మారుతుంది.

* తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చేపలు, గింజపప్పులు, పెరుగు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవటం ద్వారా వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి.

* క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను అప్లై చేసుకోవాలి. ఇందులోని లారిక్‌ యాసిడ్‌ వెంట్రుకలోని కెరటిన్‌ దెబ్బతినకుండా చూస్తుంది. ఇది వెంట్రుకల మధ్యలోని ఖాళీల్లో నిండి దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు, రసాయనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా
చల్లచల్లని.. కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..
చల్లచల్లని.. కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..
ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్..
ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్..
ఎవడ్రా నువ్వు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే కితకితలా! ఏం చేశాడో చూస్తే
ఎవడ్రా నువ్వు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే కితకితలా! ఏం చేశాడో చూస్తే
ఈ ఫీచర్లు.. సెల్ ఫోన్లను కాపాడే పోలీసులు.. షాక్ అవ్వకండి..
ఈ ఫీచర్లు.. సెల్ ఫోన్లను కాపాడే పోలీసులు.. షాక్ అవ్వకండి..
మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?
మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
పురాతన నిధి కోసం వెతుకుతుండగా దొరికిన నల్లటి సంచి.. ఏముందో చూడగా.
పురాతన నిధి కోసం వెతుకుతుండగా దొరికిన నల్లటి సంచి.. ఏముందో చూడగా.
కల్కి సరికొత్త ట్రెండ్.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ ఎక్కడో తెలుసా.?
కల్కి సరికొత్త ట్రెండ్.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ ఎక్కడో తెలుసా.?
మద్యం తాగిన తర్వాత వాంతి ఎందుకు అవుతుందో తెలుసా?
మద్యం తాగిన తర్వాత వాంతి ఎందుకు అవుతుందో తెలుసా?
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.