గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మెంతికూర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడంలో మెంతి ఆకులు ఉపయోగపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారంలో మెంతికూరను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువుత తగ్గిస్తాయి.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతి ఆకులు బాగా పనిచేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యానికి కాపాడడంలో కూడా మెంతికూర ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. శరీరంలోకి వచ్చే విష పదార్థాలను, సూక్ష్మ క్రిములను అడ్డుకోవడం మెంతి ఆకులు ఉపయోగపడుతాయి
అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతి కూడా ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు మెంతి కూర తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.
మెంతులను పేస్టులా చేసి జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగపడుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
మెంతి ఆకులు లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లివర్ కణాలు దెబ్బ తినకుండా చూడడంలో మెంతి ఆకులు ఉపయోగపడతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.