గుడ్డు తిన్న వెంటనే వీటిని తింటున్నారా .. ప్రమాదకరం 

26 June 2024

TV9 Telugu

Pic credit - pexels

మాంసకృత్తులతో పాటు, గుడ్డు అనేక పోషకాల నిధి. కండరాలను బలోపేతం చేయడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

ఆరోగ్యానికి గుడ్డు

గుడ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాలుగా గుడ్డుని తినే ఆహారంలో చేర్చుకుంటారు. అయితే కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.

గుడ్ల చెడు కలయిక

అరటిపండును గుడ్లని తింటూ లేదా గుడ్డు తిన్న వెంటనే తినకూడదు. ఈ కాంబినేషన్ లో గుడ్డిని తింటే అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల బారిన పడవచ్చు 

 అరటి పండు 

గుడ్డు , సోయా బీన్స్ రెండూ ప్రోటీన్ మూలాలు. అయితే ఒకటి జంతు ఉత్పన్నమైన ప్రోటీన్ పదార్ధం.. మరొకటి మొక్కల ఆధారితం.. కనుక ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం మానుకోవాలి.

సోయా పాలు

ఎక్కువగా అల్పాహారంగా ఆమ్లెట్, ఎగ్ టోస్ట్ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కాఫీ, టీలను కూడా తీసుకుంటారు.అయితే ఈ కలయిక యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం కావచ్చు.

టీ , కాఫీ

గుడ్లు తిన్న వెంటనే లేదా తర్వాత నిమ్మకాయను తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని గుడ్డు వంటలలో నిమ్మకాయను ఉపయోగించినప్పటికీ, రెండింటి ప్రతిచర్య హానిని కలిగిస్తుంది.

నిమ్మకాయ 

గుడ్లు తింటూ లేదా తిన్న వెంటనే నీరు త్రాగవద్దు. గుడ్డు ప్రోటీన్‌ జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది. తద్వారా కడుపు నొప్పి, అజీర్ణానికి కారణమవుతుంది. అసలు ఏదైనా ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడానికి దూరంగా ఉండాలి.

నీరు త్రాగవద్దు

పన్నీర్, గుడ్లని కలిపి ఆహారాన్ని తయారు చేసి తింటారు. ఇలా తినడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి 

పన్నీరు 

గుడ్లు, చేపలను కలిపి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి తినడం కూడా అనారోగ్యానికి కారణం. కొంతమందికి స్కిన్ అలెర్జీ కలుగుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి.  

చేపలతో