నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సానియా.. పక్కన ఎవరి పేరుందో తెలుసా?

22 May 2024

TV9 Telugu

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో సానియా తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. దుబాయ్‌లో ఉంటుంది.

పాత జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ.. కొత్త లైఫ్‌ను మొదలెట్టింది. అలాగే, తన విషయానలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా సానియా తన ఇంటి నేమ్‌ ప్లేట్‌లో మార్పులు చేసేసింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.

తన పేరు పక్కన కుమారుడు ఇజాన్‌ పేరు ఉండేలా ‘సానియా ఇజాన్‌’ ఉండేలా తయారు చేయించి, ఇంటి ముందు తగిలించింది.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మంచి పని చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సానియా మీర్జా కాగా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకుంది.

వీళ్లిద్దరి మ్యారేజ్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది.  ఈ క్రమంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.