టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు వ్యతిరేకంగా ఐదుగురు భాతర ఆటగాళ్లు..

24 May 2024

TV9 Telugu

9వ టీ20 ప్రపంచకప్‌ ఈ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించారు.

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 09న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడాతో మ్యాచ్‌లు జరగనున్నాయి.

అమెరికా, కెనడా జట్లతో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విశేషమేమిటంటే.. టీమిండియాకు వ్యతిరేకంగా ఐదుగురు భారత ఆటగాళ్లు ఆడనున్నారు.

అమెరికా తరపున నలుగురు భారత ఆటగాళ్లు ఆడనున్నారు. వారిలో మిలింద్ కుమార్ ఒకరు. మిలింద్ కుమార్ ఢిల్లీ, సిక్కిం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ, ఆర్‌సీబీ తరపున కూడా ఆడాడు.

ఈ జట్టులో మిలింద్ కుమార్‌తో పాటు హర్మీత్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో హర్మీత్ సింగ్ సభ్యుడు.

ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు అమెరికా జట్టులో మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవాల్కర్ కూడా ఉన్నారు. మోనాక్ పటేల్ ప్రపంచ కప్‌లో USA జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

సౌరభ్ నేత్రవాల్కర్ కూడా 2010 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫుసేన ఆడాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరపున కూడా ఆడాడు.

పర్గత్ సింగ్ ఇప్పుడు కెనడా జట్టులోకి వచ్చాడు. పర్గత్ సింగ్ 2015-16 రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.