‘సైకిల్‌’కు పంక్చర్.. నారా, నందమూరి పార్టీలుగా టీడీపీ

టీడీపీ పార్టీ రెండుగా చీలిపోనుందని.. నారా పార్టీ, నందమూరి పార్టీగా విడిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈసీపై అనవసరంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తనపైన ఏ తప్పులు పడకుండా.. పక్కవారిని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ ధ్వజమెత్తారు. ఇక తమకు, వైసీపీ మధ్య కూడా చంద్రబాబు లింక్‌లు పెట్టారని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ […]

‘సైకిల్‌’కు పంక్చర్.. నారా, నందమూరి పార్టీలుగా టీడీపీ

Updated on: May 21, 2019 | 4:04 PM

టీడీపీ పార్టీ రెండుగా చీలిపోనుందని.. నారా పార్టీ, నందమూరి పార్టీగా విడిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈసీపై అనవసరంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తనపైన ఏ తప్పులు పడకుండా.. పక్కవారిని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ ధ్వజమెత్తారు.

ఇక తమకు, వైసీపీ మధ్య కూడా చంద్రబాబు లింక్‌లు పెట్టారని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలిసి ఎక్కడా పోటీ చేసిన దాఖలు కూడా లేవని ఆయన అన్నారు. ఏపీలోని అన్ని వ్యవస్థలను బాబు నిర్వీర్యం చేశారని మాధవ్ ఆరోపణలు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us