ప్రొద్దుటూరు టీడీపీ నేత హత్య కేసులో కొత్త కోణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్బయ్య సతీమణి అపరాజిత

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమాణపై సుబ్బయ్య సతీమణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రొద్దుటూరు టీడీపీ నేత హత్య కేసులో కొత్త కోణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్బయ్య సతీమణి అపరాజిత
Follow us

|

Updated on: Jan 02, 2021 | 2:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యపై రాజకీయ దుమారం రాజుకుంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమాణపై సుబ్బయ్య సతీమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త టీడీపీ నేత సుబ్బయ్యను ముమ్మాటికీ ఎమ్మెల్యే, అనుచరులు హత్య చేయించారని ఆరోపించారు. సుబ్బయ్య హత్యకేసులో స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో ఆయన తన నియోజకవర్గంలో ఉన్న ఆలయంలో ప్రమాణం చేశారు. తనకు ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమాణపై సుబ్బయ్య సతీమణి అపరాజిత స్పందించారు. తన భర్త హత్యతో సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి దైవ ప్రమాణం చేశారని.. తాను ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి తన భర్తను చంపారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందన్నారు. బంగారు రెడ్డిపై మొదటి నుండి ఇన్ని ఆరోపణలు వచ్చిప్పుడు.. ఆయన ఎందుకు స్పందిచలేదని అపరాజిత ప్రశ్నించారు. బంగారు రెడ్డి కూడా ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్త మొబైల్ ఇప్పటి వరకు దొరకలేదన్న ఆమె.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో