Tamil TV Actress Padmaja: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వీరాభిమాని, తమిళ నటి పద్మజ చెన్నై తిరువొట్టియూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 23 ఏళ్ల పద్మజ ఆర్ధిక సమస్యల వల్ల నిరాశకు లోనయ్యి ఉరి వేసుకున్నారు.
తిరువొట్టియూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న పద్మజ కొన్నేళ్ల కిందట భర్త పవన్(25) నుంచి విడిపోయారు. వైవాహిక జీవితంలో ఎదురైన తీవ్ర మనస్పర్థలు కారణంగా ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పవన్, పద్మజలకు రెండేళ్ల బాబు ఉండగా.. అతడ్ని ఆమె దగ్గర బంధువులు చూసుకుంటున్నారు.
ఆదివారం పద్మజ తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని చనిపోగా.. రెండు రోజులగా ఆమె ఫ్లాట్ లాక్ చేసి ఉండటంతో ఆ ఇంటి యజమాని ఎస్ కాసినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును తిరువొట్టియూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పద్మజ చనిపోయే ముందు.. ఆమె సోదరికి వీడియో కాల్ చేసి.. తన బాధలు, ఆర్ధిక సమస్యల గురించి చెప్పుకున్నారు. తమిళ సీరియల్స్‌లో పలు సహాయక పాత్రలు, వాణిజ్య ప్రకటనల, సినిమాలతో పద్మజ ప్రేక్షకులకు సుపరిచితురాలు.
For More News:
హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!
రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!
అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!
కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్
టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!
మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?
మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!