సుశాంత్ డెత్ మిస్టరీ.. వైరల్ అవుతున్న మరో వీడియో.!

|

Aug 14, 2020 | 4:58 PM

రెండు నెలలు గడిచింది. ఇంకా సుశాంత్ మరణం వెనుక మిస్టరీ వీడలేదు. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.. సుశాంత్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతూనే ఉంది.

సుశాంత్ డెత్ మిస్టరీ.. వైరల్ అవుతున్న మరో వీడియో.!
Follow us on

Sushant Singh Rajput Case: రెండు నెలలు గడిచింది. ఇంకా సుశాంత్ మరణం వెనుక మిస్టరీ వీడలేదు. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.. సుశాంత్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతూనే ఉంది. ప్రతీరోజూ ఏదొక మలుపు.. అంతేకాకుండా తెరపైకి కొత్త క్యారెక్టర్లు వస్తూనే ఉన్నాయి. మొదటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగా సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రంగంలోకి దిగారు. సుశాంత్ మరణానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఇక సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఎక్స్ క్లూజివ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సుశాంత్ సోదరి మనీ ట్రాన్స్ ఫర్ గురించి అకౌంటెంట్ ను ప్రశ్నిస్తున్నారు. పంకజ్ అనే వ్యక్తికి డబ్బు బదిలీ చేయమని ఎవరు చెప్పారో.. ఆ వ్యక్తి పేరు చెప్పాలని నిలదీస్తున్నారు. అయితే వారి ప్రశ్నలకు మాత్రం ఆ అకౌంటెంట్ అసలు సమాధానం ఇవ్వట్లేదు. కేవలం మౌనం వహిస్తున్నాడు. దీనితో పేరు చెప్పకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. కాగా, సుశాంత్‌కు న్యాయం జరగాలని అందరూ ప్రార్ధించాలని.. ఆగష్టు 15న ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్‌..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..