అక్కడ ఫుడ్‌తో చంపేస్తారు.. కానీ కంచం ఖాళీ చేస్తే లక్ష గిఫ్ట్.!

|

Jan 29, 2020 | 11:37 AM

Surat Bakasur Thali: నాయక్ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి కామెడీ సీన్ మీకు గుర్తుందా.. అందులో బ్రహ్మానందానికి పెద్ద కంచం నిండా ఫుడ్ పెట్టి తినమని జయప్రకాశ్ ఆర్డర్ వేస్తాడు. అందుకు బ్రహ్మి.. ‘ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు.. మనిషన్న వాడు ఎవడైనా ఇంత ఫుడ్ తింటాడా.. చచ్చిపోతాడు అంటూ అమాయకంగా అడుగుతాడు. అయినా ఆ మాటలు వినకుండా జయప్రకాశ్ రెడ్డి మొత్తం తినిపిస్తాడు.. ఇంకేముంది కట్ చేస్తే బ్రహ్మానందం హాస్పిటల్ పాలవుతాడు. ఇప్పుడు సరిగ్గా […]

అక్కడ ఫుడ్‌తో చంపేస్తారు.. కానీ కంచం ఖాళీ చేస్తే లక్ష గిఫ్ట్.!
Follow us on

Surat Bakasur Thali: నాయక్ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి కామెడీ సీన్ మీకు గుర్తుందా.. అందులో బ్రహ్మానందానికి పెద్ద కంచం నిండా ఫుడ్ పెట్టి తినమని జయప్రకాశ్ ఆర్డర్ వేస్తాడు. అందుకు బ్రహ్మి.. ‘ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు.. మనిషన్న వాడు ఎవడైనా ఇంత ఫుడ్ తింటాడా.. చచ్చిపోతాడు అంటూ అమాయకంగా అడుగుతాడు. అయినా ఆ మాటలు వినకుండా జయప్రకాశ్ రెడ్డి మొత్తం తినిపిస్తాడు.. ఇంకేముంది కట్ చేస్తే బ్రహ్మానందం హాస్పిటల్ పాలవుతాడు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీన్‌ను గుజరాత్‌లోని ఓ రెస్టారెంట్ రిపీట్ చేస్తోంది.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ రెస్టారెంట్ బకాసుర థాలి పేరుతో సరికొత్త స్కీం‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 55 రకాల వంటకాలు, 12 రకాల స్వీట్లు, 7 రకాల సలాడ్లు, 15 రకాల రోటీలను వడ్డిస్తారు. ఇక వచ్చే కస్టమర్ వీటిని మిగల్చకుండా తింటే లక్ష రూపాయల గిఫ్ట్ కూడా ఇస్తారు. ఒకవేళ ఆ థాలిని పూర్తి చేయకపోతే మాత్రం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో పాల్గొనేందుకు సూరత్ వాసులు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా, ఇలాంటి విచిత్రమైన ఫుడ్ పోటీని ఒకటి మంగళూరు రెస్టారెంట్ కూడా ఇటీవల ప్రారంభించింది. 56 రకాల వంటలతో, 10 రకాల డెసర్ట్‌లు, 4 డ్రింక్‌లు, 4 రకాల చట్నీలు, 5 రకాల చిత్రాన్నాలు, రోటీలు, పచ్చళ్ళు, 8 రకాల కూరలు వడ్డిస్తారు. కాగా, కస్టమర్లను ఆకర్షించడం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్న రెస్టారెంట్లలు ఈ విధమైన థాలీలను ఏర్పాటు చేస్తున్నాయి.