కమలా హారిస్ విజయం కోసం ‘తమిళ గ్రామ’ ఆలయంలో పూజలు

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2020 | 3:34 PM

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ విజయం కోసం తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామంలో గల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈమెపై ఈమె గ్రాండ్ ఫాదర్ పీవీ గోపాలన్ ప్రభావం ఎంతగానో ఉంది. ఇండియాతో బాటు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేసిన ఆయన గురించిన సమాచారాన్ని కమలా హారిస్ గతంలోనే షేర్ చేసుకున్నారు. చెన్నైకి 390 కి.మీ. దూరలోని ఈ గ్రామంలో గల తులసేంద్రపురం దేవాలయంలో కమలా హారిస్ గెలుపు […]

కమలా హారిస్ విజయం కోసం తమిళ గ్రామ ఆలయంలో పూజలు
Follow us on

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ విజయం కోసం తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామంలో గల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈమెపై ఈమె గ్రాండ్ ఫాదర్ పీవీ గోపాలన్ ప్రభావం ఎంతగానో ఉంది. ఇండియాతో బాటు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేసిన ఆయన గురించిన సమాచారాన్ని కమలా హారిస్ గతంలోనే షేర్ చేసుకున్నారు. చెన్నైకి 390 కి.మీ. దూరలోని ఈ గ్రామంలో గల తులసేంద్రపురం దేవాలయంలో కమలా హారిస్ గెలుపు కోసం ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ దేవుడంటే తమకు ఎంతో నమ్మకమని, తమ ఇంట ఏ శుభకార్యాలు జరిగినా ఈ గుడికి  వచ్చి పూజలు చేస్తుంటామని కమల మేనత్త డాక్టర్ సరళా గోపాలన్ తెలిపారు. ఈ దేవుడు తమ కులదైవమన్నారు.

ఈ ఆలయ గోడలపై దీని అభివృద్దికి విరాళాలు ఇఛ్చినవారి పేర్లను ముద్రించారు. ఆ పేర్లలో కమలా హారిస్ పేరు కూడా ఉంది. 2014 లో ఆమె ఈ గుడికి రూ. 5 వేల విరాళమిచ్చారట. అమెరికా ఎన్నికల్లో ఈమె విజయం కోసం ఈమె అభిమానులు ఇక్కడ పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.