ఈ సోమవారం ఓ శుభవార్త వింటారు.. ఎస్పీ చరణ్

ఓ మంచి విషయం చెప్పారు ఎస్పీ చరణ్. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి..

ఈ సోమవారం ఓ శుభవార్త వింటారు.. ఎస్పీ చరణ్

Updated on: Sep 03, 2020 | 6:05 PM

SP Balasubramaniam health : ఓ మంచి విషయం చెప్పారు ఎస్పీ చరణ్. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా ప్రకటించారు.
ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా స్పందించిన చరణ్‌.. వరుసగా నాలుగో రోజు ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని తెలిపారు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని తెలిపారు. దీంతో సోమవారం బాలు డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో (ICU) ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత బాలుకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు స్వల్పంగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని.. పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా  వెల్లడించాయి. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.
Loading...
Unable to load recommendations.
Follow Us