హెల్త్ బులిటెన్: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం

|

Aug 14, 2020 | 6:24 PM

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటన్‌ను విడుదల చేశాయి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు...

హెల్త్ బులిటెన్: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం
Follow us on

SPB Health Condition in critical : ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటన్‌ను విడుదలైంది. ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని.. ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్‌గా ఉందని అన్నారు.  అయితే వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యలు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాని తెలిపారు. దీంతో ఆయనను ఐసీయూలోకి తరలించి ఆక్సిజన్ అందిస్తున్నామని వెల్లడించారు. ఆయన మైడిపెండెన్సీలో ఉంచి ఆయన ఆరోగ్యాన్ని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.

చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్  ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.  అంతేకాదు తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.