బంపర్ ఆఫర్ ప్రకటించిన వలసకార్మికుల దేవుడు

తన పుట్టిన రోజును కూడా కష్టాల్లో ఉన్నవారి కోసం కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతటితో ఆగిపోకుండా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు....

బంపర్ ఆఫర్ ప్రకటించిన వలసకార్మికుల దేవుడు

Updated on: Jul 30, 2020 | 8:38 PM

ఆపదలో ఉన్నాను అంటే చాలు ఎక్కడున్నా నేనున్నాను అంటూ ఆదుకుంటున్నాడు రియల్ హీరో సోను సూద్. కష్టాల్లో ఉన్నవారిని వెతుకుంటూ వెళ్లి సాయం అందిస్తున్నారు. పిలిచిన వెంటనేపలికే వలస కార్మికుల దేవుడు సోను సూద్ పుట్టిన రోజు నేడు.

తన పుట్టిన రోజును కూడా కష్టాల్లో ఉన్నవారి కోసం కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతటితో ఆగిపోకుండా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వలస కార్మికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. వారిని ఆదుకునేందుకు మరో ముందడుగుడు వేశారు.

కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదిన కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రవాస సోదరులకు ‘ప్రవాసిరోజ్‌గర్‌.కామ్’‌ ( http://PravasiRojgar.com ) లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను అని తెలిపారు. మంచి వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఇతర సదుపాయాలు కూడా అందుతాయని తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us