”విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దు”

|

Aug 26, 2020 | 12:41 PM

జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ), నీట్‌ ( NEET )లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దు
Follow us on

Sonu Sood Demands: జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ), నీట్‌ ( NEET )లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్‌సైట్‌లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది.

అయితే దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడకండి అంటూ వారు గళం విప్పుతున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ పరీక్షలను వాయిదా వేయాలంటూ చిన్నపాటి ఉద్యమం జరుగుతోంది. ఇక వారికి పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా చేరారు. ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.

”ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులను సంరక్షించాలి. వారి జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దు. పూర్తి ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరట్లేదని.. కేవలం 2 లేదా 3 నెలలు మాత్రమే వాయిదా వేయాలని కోరుతున్నాను” అని సోనూసూద్ పేర్కొన్నాడు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..