కాంగ్రెస్ ఎంపీ వినూత్న ఫోటో… ఎవరో గుర్తుపట్టగలరా!

కాంగ్రెస్ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన చేసే ట్వీట్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఆయనో ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. తన ఫొటోను ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్‌ స్పియర్‌ ఫొటోను ఎవరో మార్ఫింగ్‌ చేసి థరూర్‌కు పంపారు. దీన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ‘వాట్సాప్‌లో తెగ వైరల్‌ అయి ప్రశంసలు దక్కించుకున్న ఫొటో ఇది. ఈ విధంగా […]

కాంగ్రెస్ ఎంపీ వినూత్న ఫోటో... ఎవరో గుర్తుపట్టగలరా!
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 6:52 PM

కాంగ్రెస్ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన చేసే ట్వీట్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఆయనో ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. తన ఫొటోను ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్‌ స్పియర్‌ ఫొటోను ఎవరో మార్ఫింగ్‌ చేసి థరూర్‌కు పంపారు. దీన్ని ఆయన ట్వీట్‌ చేశారు.

‘వాట్సాప్‌లో తెగ వైరల్‌ అయి ప్రశంసలు దక్కించుకున్న ఫొటో ఇది. ఈ విధంగా నా ఫొటోను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. దీన్ని సృష్టించడానికి వాళ్లు(ఫొటోను మార్ఫింగ్‌ చేసిన వాళ్లు) చాలా కష్టపడి ఉంటారనుకుంటాను. ఇది ఎవరు చేశారో వాళ్లకి ధన్యవాదాలు.  నేను షేక్‌స్పియర్‌తో పోల్చకునేంత గొప్ప వ్యక్తిని కాదు’ అని ట్వీట్‌ చేసి ఈ ఫొటో షేర్‌ చేశారు. ఈ ట్వీట్‌ కాసేపటికే వైరల్‌ అయింది.

అయితే, ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు థరూర్‌కు బాసటగా నిలిచారు. కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఎంపీ ఇలా కాలక్షేపం చేస్తున్నారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వీటిని మరి కొందరు తిప్పి కొట్టారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి థరూర్‌ ట్వీట్లు చేస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి యువత ముందుకు రావాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.

Latest Articles
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్