ఉత్తర భారతమంతా చలికి గజగజ వణికిపోతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలావరకు పడిపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా ఫ్లూ, జ్వరం వంటి రుగ్మతలు పేట్రేగుతాయని నిపుణులు హెచ్ఛరిస్తున్నారు. ఇదే సమయంలో ఆల్కహాల్ (మద్యం) తాగకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఆల్కహాల్ సేవిస్తే.. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందని ఇది ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. చాలావరకు ఇళ్లలోనే ఉండాలని, విటమిన్ సీ తో కూడిన పండ్లను తినాలని, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలని వారు పేర్కొన్నారు. హిమాలయాల నుంచి వచ్ఛే శీతల గాలుల కారణంగా ఉత్తర భారతంలో కనీస ఉష్ణోగ్రతలు మూడు నుంచి అయిదు డిగ్రీల వరకు పడిపోవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా నార్త్ లో ఉదయం 9 గంటలవుతున్నప్పటికీ మంచు దుప్పటి వీడడంలేదు. పగలు కూడా వాహనదారులు తమ వాహనాల లైట్లతో ప్రయాణించవలసి వస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్, లడాఖ్ వంటి చోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
Read More: