కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా లైన్ క్లియర్ అయిందా?

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీ.. నేడు రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది. 60 మందితో మంత్రివర్గం ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే అంశంపై చర్చ నడుస్తోంది. గత రాత్రే పలువురు ఎంపీలకు ఫోన్స్ వెల్లినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గంపై మోదీ-షా తీవ్రమైన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ […]

కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా లైన్ క్లియర్ అయిందా?
Follow us

|

Updated on: May 30, 2019 | 12:07 PM

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీ.. నేడు రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది. 60 మందితో మంత్రివర్గం ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే అంశంపై చర్చ నడుస్తోంది. గత రాత్రే పలువురు ఎంపీలకు ఫోన్స్ వెల్లినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గంపై మోదీ-షా తీవ్రమైన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి ఘన విజయం సాధించిన కిషన్‌రెడ్డికి  కేంద్ర మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి దాదాపు 50వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నరేంద్రమోదీ, అమిత్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు కిషన్‌రెడ్డికి సమాచారం అందిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సికింద్రాబాద్‌ ఎంపీగా పనిచేసిన బండారు దత్తాత్రేయ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలనే  నిర్ణయంతో ఈ సారి కిషన్‌రెడ్డికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిషన్‌రెడ్డి ఓడిపోయారు. ఆతర్వాత కొద్దికాలానికే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. ఆయనపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం కూడా అప్పటి సిట్టింగ్‌ ఎంపీ దత్తాత్రేయను కాదని కిషన్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించింది. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్న కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుండటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Latest Articles
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా