మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తప్పు కాదన్న బాంబేహైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే, ఇలాంటి రూలింగ్ సరికాదన్న నిపుణులు

మైనర్ బాలికను 'తడిమితే' అది లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు ఇచ్చిన   తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటివి ప్రమాదకరమైన,

  • Umakanth Rao
  • Publish Date - 2:21 pm, Wed, 27 January 21
మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే  తప్పు కాదన్న బాంబేహైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే,  ఇలాంటి రూలింగ్ సరికాదన్న నిపుణులు

మైనర్ బాలికను ‘తడిమితే’ అది లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు ఇచ్చిన   తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటివి ప్రమాదకరమైన, పెడ ధోరణులకు దారి తీస్తాయని అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.  బాంబే కోర్టు ఈ నెల 19 న వివాదాస్పదమైన ఉత్తర్వును ఇస్తూ..స్కిన్ టు స్కిన్ (శరీరం) తాకకుండా మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద అది లైంగిక దాడి కాదని పేర్కొంది. జస్టిస్ పుష్ప గనెడివాలా ఈ ఉత్తర్వు నిచ్చారు.

2016  డిసెంబరులో నాగపూర్ లో సతీష్ అనే వ్యక్తి తనకు స్వీట్ ఇస్తానని మభ్యపెట్టి తన ఇంటికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని 12 ఏళ్ళ బాలిక ఒకరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. అతనికి దిగువకోర్టు 3 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే ఆ వ్యక్తి దీన్ని సవాలు చేస్తూ బాంబేహైకోర్టు కెక్కాడు. అతడిని ఈ కోర్టు నిర్దోషిగా విడిచిపుచ్చింది. బాలల హక్కుల సంఘాలు ఈ తీర్పు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.  ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు తీర్పు మీద స్టే విధించింది.
Read Also:కొడుక్కి స్కూటీ ఇచ్చిన తండ్రి.. భారీ జరిమానాతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. జరిమానా ఎంతంటే..?
Read Also:కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదు.. అది పూర్తిగా రాష్ట్ర హక్కు..