సమంత మనోగతాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఆమె ఏ విషయాన్ని కూడా డైరెక్ట్‌గా చెప్పదు. విడాకుల తరువాత తన స్టేటస్‌లో సంచలన పోస్ట్ పెట్టారు.
‘నేను బాధ.. నిస్పృహలో ఉన్నప్పుడు ఒక విషయం అర్ధమయ్యింది. చివరకు ప్రేమే గెలుస్తుందనేది చారిత్రక సత్యం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల , నియంతలు ఉంటారు..వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు చాలా నిపుణులు.చివరకు వాళ్లు సర్వనాశనం కావడం ఖాయం. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఇది మా అమ్మ నాకు చెప్పిన నిజం అంటూ స్టోరీని ముగించారు సమంత. ఈ స్టోరీని చూస్తే ఒక్క విషయం అర్ధమవుతుంది. విడాకుల విషయంలో సామ్ చాలా బాధలో ఉన్నారు. ఎంతో బాధ తోనే డివోర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈవియంలో సందేహం లేదు. అంత బాధపడుతూ ఆమె ఈ పోస్ట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ స్టోరీ రాశారో తెలియదు. కాని తన అమ్మ చెప్పిన విషయాన్ని విడాకుల తరువాత స్టేటస్‌లో పోస్ట్ చేయడం సంచలనం రేపింది.
Also Read: ఆ ఇంట ఒదిగిపోయింది.. కానీ అనూహ్యంగా ఏమైంది..?
విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య