ధోనితో నన్ను పోల్చవద్దుః రోహిత్ శర్మ

భారత జట్టులో రోహిత్ శర్మ తదుపరి ధోని అవుతాడని సురేష్ రైనా వెల్లడించిన సంగతి తెలిసిందే. ధోని, రోహిత్ శర్మలలో ఒకేలాంటి సామర్ధ్యాలు ఉన్నాయని..

ధోనితో నన్ను పోల్చవద్దుః రోహిత్ శర్మ

Updated on: Aug 07, 2020 | 1:58 PM

Rohit Sharma Comments: భారత జట్టులో రోహిత్ శర్మ తదుపరి ధోని అవుతాడని సురేష్ రైనా వెల్లడించిన సంగతి తెలిసిందే. ధోని, రోహిత్ శర్మలలో ఒకేలాంటి సామర్ధ్యాలు ఉన్నాయని.. యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల సూచనలు వినడంలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉంటారని రైనా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరూ కూడా ధోని తర్వాత రోహిత్‌నే కెప్టెన్‌గా భావిస్తున్నారని.. నా పుస్తకంలో వీరిద్దరే అద్భుతమైన కెప్టెన్లు అని రైనా వివరించాడు. ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా రోహిత్ శర్మ స్పందించాడు.

”ధోని ఓ లెజెండ్. అతడు భారత్ జట్టుకు దొరికిన ఓ అరుదైన ఆటగాడు. ఇక నన్ను ధోనితో పోల్చడం సరికాదు. నేను అయితే ఎవరితోనూ పోల్చవద్దని చెబుతాను. ఎందకంటే ప్రతీ ప్లేయర్‌లోనూ ఓ సామర్ధ్యం ఉంటుంది. అలాగే కెప్టెన్లలకు కూడా వారి ప్లానింగ్, ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. కాబట్టి అందరూ భిన్నమే అని రోహిత్ వివరించాడు. కాగా, రోహిత్‌ను ధోనితో గతంలో మాజీ ప్లేయర్స్, దిగ్గజాలు పోల్చిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us