ధోని వారసుడు అతడే : నెహ్రా

|

Oct 07, 2020 | 3:48 PM

ఇంటర్నేషనల్ టెస్టు క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు చెప్పి 6 సంవత్సరాలు అవుతుంది.   ఈ ఆరేళ్లలో మహీ లాంటి కీపర్ కమ్ ప్లేయర్ జట్టుకు దొరకలేదు.

ధోని వారసుడు అతడే : నెహ్రా
Follow us on

ఇంటర్నేషనల్ టెస్టు క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు చెప్పి 6 సంవత్సరాలు అవుతుంది.   ఈ ఆరేళ్లలో మహీ లాంటి కీపర్ కమ్ ప్లేయర్ జట్టుకు దొరకలేదు. ఈ ఆరేళ్లలో భారత్ తన టెస్టు జట్టులో వృద్ధిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లను అవకాశం ఇచ్చింది. ఇద్దరూ కొన్ని ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు తప్పితే, నిలకడగా రాణించలేదు. అందుకే ఇప్పటికీ టెస్టు జట్టులో వికెట్‌కీపర్‌ స్థానం కోసం వెతుకులాట సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా రిషబ్‌ పంత్‌కు ఉందని, ధోనీ వారసుడు పంత్‌ మాత్రమేనని భారత మాజీ పేసర్ ఆశిష్‌ నెహ్రా అభిప్రయపడ్డాడు.

భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలకు ఆశిష్‌ నెహ్రా మద్దతు పలికాడు. ‘ఇప్పుడు మనం ఏ ఫార్మాట్‌ గురించి మాట్లాడుతున్నామనేది ముఖ్యం కాదు. బంగర్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. రిషబ్ పంత్‌ను భారత జట్టులో ఆడించాలని కోరుకుంటున్నా. ఈ ఐపీఎల్‌లో అతను బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌ ద్వారా పంత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం’ అని నెహ్రా పేర్కొన్నాడు. ( రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )

ఇదివరకు సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘ఈ  ఐపీఎల్‌లో రిషబ్ పంత్ మంచి ఆరంభం ఇచ్చాడు . లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్‌గా రాణిస్తున్న పంత్.. భారత మిడిల్ ఆర్డర్‌ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిపోతాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరం. ధోనీ వారసుడు పంత్‌’ అని చెప్పాడు. ( ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..? )