AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమరోత్సాహంతో చెన్నై, గెలిచి తీరాలన్న పట్టుదలతో కోల్‌కతా

ఐపీఎల్‌లో మరో కీలక సమరం జరగబోతున్నది. మరి కొద్ది గంటల్లో అబుదాబి వేదికగా జరిగే ఈ పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి..

సమరోత్సాహంతో చెన్నై, గెలిచి తీరాలన్న పట్టుదలతో కోల్‌కతా
Balu
| Edited By: |

Updated on: Oct 07, 2020 | 3:54 PM

Share

ఐపీఎల్‌లో మరో కీలక సమరం జరగబోతున్నది. మరి కొద్ది గంటల్లో అబుదాబి వేదికగా జరిగే ఈ పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం రెండు జట్లకు అత్యంత అవసరం. కోల్‌కతా గెలిస్తే టాప్‌4 ప్లేస్‌ దాదాపు ఖాయమవుతుంది.. చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగవుతాయి.. ఐపీఎల్‌లో ఈ రెండు టీమ్‌లు ఇప్పటి వరకు 20 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్‌కింగ్స్‌ 13 మ్యాచ్‌లలో గెలుపొందింది. కోల్‌కతాకు కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే గెలుపు దక్కింది.. చివరగా జరిగిన రెండు మ్యాచ్‌లను కూడా చెన్నై ఎగరేసుకుపోయింది. ఇక అబుదాబిలో కోల్‌కతా అయిదు మ్యాచ్‌లు ఆడితే మూడింట్లో ఓడిపోయింది.. చెన్నై ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది.. ఆ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఇవాళ కూడా బరిలో దిగబోతున్నది. వాట్సన్‌, డుప్లెసిస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్‌ ఆర్డర్‌ కుదురుకుంటే భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. కేదార్‌ జావద్‌ బ్యాట్‌ నుంచి కానీ, రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి కానీ పెద్దగా పరుగులు రాలేదు.. ఈ మ్యాచ్‌తో ఆ బాకీ తీర్చుకోవాలనుకుంటున్నారు.. కోల్‌కతా విషయానికి వస్తే అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ టీమ్‌ బలంగానే ఉంది.. కాకపోతే విజయాలే ఎక్కువ రావడం లేదు..ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోతున్నారు.. భారమంతా శుభ్‌మన్‌గిల్‌, ఇయాన్‌ మోర్గాన్‌లపైనే పడుతోంది.. సునీల్‌ నరైన్‌, రసెల్‌లు బ్యాట్‌ దుమ్ము దులపాల్సిన అవసరం ఏర్పడింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మహేంద్ర సింగ్‌ ధోని (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, అంబటి రాయుడు, మురళీ విజయ్, కేదార్‌ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్‌ చహర్, పీయూష్‌ చావ్లా, నారాయణ్‌ జగదీశన్, కేఎం ఆసిఫ్, శార్దుల్‌ ఠాకూర్, సాయికిషోర్, మోను కుమార్, కరణ్‌ శర్మ (భారత ఆటగాళ్లు). ఇమ్రాన్‌ తాహిర్, లుంగి ఇన్‌గిడి, షేన్‌ వాట్సన్, మిషెల్‌ సాన్‌ట్నర్, ఫాఫ్‌ డు ప్లెసిస్, డ్వేన్‌ బ్రేవో, జోష్‌ హాజల్‌వుడ్, స్యామ్‌ కరన్‌ (విదేశీ ఆటగాళ్లు).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), శివమ్‌ మావి, సందీప్‌ వారియర్, కుల్దీప్‌ యాదవ్, నిఖిల్‌ నాయక్, సిద్ధార్థ్, ప్రసిధ్‌ కృష్ణ, శుబ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణా, సిద్దేశ్‌ లాడ్, కమలేశ్‌ నాగర్‌కోటి, రింకూ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ త్రిపాఠి (భారత ఆటగాళ్లు). మోర్గాన్, ప్యాట్‌ కమిన్స్, సునీల్‌ నరైన్, రసెల్, లోకీ ఫెర్గూసన్, అలీఖాన్, టామ్‌ బాంటన్, క్రిస్‌ గ్రీన్‌ (విదేశీ ఆటగాళ్లు).