మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ కానున్న మెగాపవర్ స్టార్.. జనవరి నుంచి ‘ఆచార్య’ సెట్‌‌‌‌కు చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా..

  • Rajeev Rayala
  • Publish Date - 7:18 pm, Mon, 28 December 20
మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ కానున్న మెగాపవర్ స్టార్.. జనవరి నుంచి 'ఆచార్య' సెట్‌‌‌‌కు చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించానున్నారని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ నక్సలైట్ గా కనిపించనున్నారని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.

ఇక చిరంజీవి సరసన అందాల చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చరణ్ 40నిమిషాల కంటే ఎక్కువే కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక ‘ఆచార్య’లో చరణ్ కు జోడీ కుడా ఉండనుందని తెలుస్తుంది. అదేవిదంగా జనవరి నుంచి రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. రెండు షెడ్యూల్స్  లో చరణ్ పాత్రను పుర్తిచేయలని చూస్తున్నాడట దర్శకుడు కొరటాల. ఫిబ్రవరిలో చిరంజీవి, చరణ్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించానున్నరట. ఆచార్య చిత్ర షూటింగ్ మొతాన్ని మార్చి నెలలో పుర్తిచేయనున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్ అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో లక్కీ బ్యూటీ రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.