Crows Death In Jhalwar: రాజస్థాన్‌లోని జల్వార్ పరిధిలోని రాదీ ప్రాంతంలో భారీగా కాకులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోవడంతో.. ఆ ప్రాంతంలోని ఒక కిలోమీటరు మేర అధికారులు కర్ఫ్యూ విధించారు. ‘బర్డ్ ఫ్లూ’ కోళ్లకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జల్వార్ కలెక్టర్ స్థానికంగా ఉండే పౌల్ట్రీ షాపులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ 25వ తేదీన జల్వార్ టౌన్‌లో రాదీ ప్రాంతంలో ఒక్కసారిగా 50 కాకులు అకస్మాత్తుగా చనిపోవడంతో.. వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్, పశు సంవర్ధక శాఖ అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాకుల నుంచి తీసిన శాంపిల్స్‌ను పరీక్షించేందుకు నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబరేటరీకి పంపించారు. కాకులు చనిపోవడానికి ‘ఏవియన్ ఫ్లూ'(బర్డ్ ఫ్లూ) కారణమని గుర్తించారు. దీనితో రాదీ ప్రాంతంలోని ఒక కిలోమీటర్ మేర బుధవారం సాయంత్రం వరకు జీరో మొబిలిటీ జోన్‌ను విధించారు. అంతేకాకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు సెక్షన్ 144ను కూడా విధించినట్లు జల్వార్ జిల్లా కలెక్టర్ న్గిక్య గోహైన్ వెల్లడించారు.
Also Read: జనవరి 1 నుంచి అమలోకి వచ్చిన కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ పడనుందా.? ఓ లుక్కేయండి.!