#RainsInAP: ఏపీలో మరో రెండు రోజులు పాటు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..!

|

Nov 17, 2020 | 7:11 AM

ఏపీలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరిన్ నుంచి తమిళనాడు...

#RainsInAP: ఏపీలో మరో రెండు రోజులు పాటు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..!
Follow us on

Rains In AP: ఏపీలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరిన్ నుంచి తమిళనాడు, దక్షిణాంధ్ర తీరం మీదుగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే కొమరిన్ ప్రాంతం నుంచి అండమాన్ సముద్రం వరకు తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు.

కాగా, ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల నిన్న నెల్లూరు, తిరుపతిలో వర్షం దంచికొట్టింది. అటు చిత్తూరుతో పాటు కడప జిల్లాలో కూడా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏ క్షణమైనా జలాశయ గేట్లను ఎత్తే అవకాశముంది. దీంతో పెన్నా నదిపరీవాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Also Read:

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..