Congress Leader Rahul Gandhi: నేను వ్యవసాయ చట్టాల పైనే మాట్లాడుతా, పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

తాను వివాదాస్పద రైతు చట్టాలపైనే మాట్లాడుతానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ.. తనకు బడ్జెట్ కన్నా ఈ  అంశమే..

Congress Leader Rahul Gandhi: నేను వ్యవసాయ  చట్టాల పైనే మాట్లాడుతా, పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 7:36 PM

తాను వివాదాస్పద రైతు చట్టాలపైనే మాట్లాడుతానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ.. తనకు బడ్జెట్ కన్నా ఈ  అంశమే ముఖ్యమన్నారు. ప్రధానంగా బడ్జెట్ పై ప్రసంగించాలన్న స్పీకర్  ఓం బిర్లా సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ చట్టాలపై మాట్లాడడం ద్వారా ప్రధానిని ‘హ్యాపీగా’ ఉంచుతానని ఆయన  వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ దేశాన్ని నలుగురు పాలిస్తున్నారని అంటూ ఆయన.. ఈ సందర్భంగా ‘హమ్ దో..హమారే దో’ అనే పదాన్ని ప్రస్తావించారు.  (ఇది పాత ఫ్యామిలీ స్లోగన్).  ప్రధాని మోదీ ఇదే అంశం ఆధారంగా దేశాన్ని పాలిస్తున్నారు  అని రాహుల్ అన్నారు. రైతు చట్టాలు అన్నదాతలకే  కాక, ఈ దేశానికంతటికీ నష్టమేనని, భారత ఆహార వ్యవస్థను ఈ చట్టాలు నాశనం చేశాయని ఆయన చెప్పారు. ఇవి బడా పారిశ్రామిక వేత్తలు ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయించుకోవడానికి వారికే ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు పదేపదే అడ్డు తగులుతున్నా ఆయన పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించారు.

Also Read:

Sushant Singh: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుపై వస్తోన్న వార్తలను ఖండించిన ఎన్‌సీబీ అధికారులు.. దర్యాప్తు ఇంకా ఉందంటూ..

సంధి కుదిరింది, ప్రతిష్టంభన ముగుస్తోంది., లడాఖ్ లో పాంగాంగ్ సరస్సు వద్ద తొలగుతున్న ఉద్రిక్తతలు