‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో లారెన్స్.?

'రంగస్థలం' తమిళ రీమేక్‌లో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే లారెన్స్‌తో చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రంగస్థలం తమిళ రీమేక్‌లో లారెన్స్.?

Updated on: Aug 08, 2020 | 5:39 PM

 Rangasthalam Tamil Remake: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా 2018లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ యాక్టింగ్‌కు అభిమానులు, సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇక చరణ్ పాత్రలో ఏ హీరో నటిస్తారన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది.  ఈ తరుణంలో ‘రంగస్థలం’ తమిళ రీమేక్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే లారెన్స్‌తో చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం లారెన్స్ అక్షయ్ హీరోగా లక్ష్మీ బాంబ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హాట్ స్టార్‌లో విడుదల కానుంది.

Also Read: ‘అల దుబాయ్’లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

Loading...
Unable to load recommendations.
Follow Us