బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు బెంగుళూరు ఎయిర్ పోర్టులో టెస్టుల వెల్లువ, హ్యాండ్ స్టాంప్స్ కూడా !

కొత్తరకం మ్యుటెంట్ వైరస్ తో సతమతమవుతున్న బ్రిటన్ నుంచి బెంగుళూరు చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో..

బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు బెంగుళూరు ఎయిర్ పోర్టులో టెస్టుల వెల్లువ, హ్యాండ్ స్టాంప్స్ కూడా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2021 | 5:19 PM

కొత్తరకం మ్యుటెంట్ వైరస్ తో సతమతమవుతున్న బ్రిటన్ నుంచి బెంగుళూరు చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో వివిధ టెస్టులు నిర్వహించారు. 273 మంది ప్యాసెంజర్స్, ఆరుగురు సిబ్బందితో ఆదివారం ఉదయం తొలి విమానం ఇక్కడికి చేరుకుంది. యూకేకి విమాన సర్వీసులకు సంబంధించి బ్యాన్ ఈ నెల 6 తో ముగియడంతో మళ్ళీ పాక్షికంగా వీటిని పునరుధ్ధరించారు. ఈ ఉదయం కెంపెగౌడ ఎయిర్ పోర్టులో దిగినవారికి అన్ని కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు. వీరిని సులభంగా గుర్తించేందుకు వారి చేతులపై స్టాంప్ వేశారు. దీనిపై ‘యూకే ప్యాసింజర్’ అని రాసి ఉండడమే గాక, తేదీని కూడా ముద్రించారు. ఈ ప్యాసింజర్లు, సిబ్బంది అంతా ఎసింప్టోమాటిక్ అని, కానీ నలుగురు ప్రయాణికులను మాత్రం ఐసొలేట్ చేశామని , వారి రిపోర్టుల కోసం వేచి చూస్తున్నామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. ఇండియాలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య తాజాగా 90 కి చేరుకున్న విషయం గమనార్హం.

దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ముఖ్యంగా యూకే నుంచి ఇండియాకు వచ్ఛే ప్రయాణికులు, విమాన సిబ్బంది పట్ల ప్రత్యేక టెస్టులు నిర్వహించాలని సూచించింది.

Also Read:

‘నువ్వా, నేనా సై..’ ఎన్నికల నోటిఫికేషన్ పై రేపే హైకోర్టులో విచారణ, ఈసీ వద్దన్నా.. నెల్లూరులో ‘అమ్మఒడి’ షురూ చేయనున్న సీఎం జగన్

Visakha Agency: విశాఖ ఏజెన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బొలేరో కారు.. ఇద్దరు మృతి

తాటి చెట్టు ఎక్కేసి.. కల్లు చుక్క తాగేసి…చిందులే.. చిందులు.. జనగామ జిల్లాలో గీత కార్మికులకు కొత్త టెన్షన్