ఐపీఎల్ కోసం బీసీసీఐ కొన్ని నిబంధనలను(ఎస్‌ఓపీ) జారీ చేసింది. యూఏఈలో బయో బబుల్‌లోకి రావడానికి ముందు క్రికెటర్లు, ఇతరులు ఐదుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఫ్రాంచైజీలు ఆటగాళ్లు స్వస్థలాల్లోనూ కొవిడ్ పరీక్షలు చేయించుకునేలా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు.
యూఏఈ వెళ్లడానికి ముందు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రెండు పరీక్షలకు అదనంగా మరో రెండు నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ముంబైలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌కు వెళ్లింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా మరో ఫ్రాంచైజీ తమ క్రికెటర్లకు సూచించింది.