63 శాతం కరోనా మరణాలు 60ఏళ్ల పైబడిన వారే: కేంద్రం

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 30 మంది చనిపోయినట్లు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,067కి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇందులో 1445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధించినవేనని వివరించారు. ఇతర శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం సంయుక్త మీడియా […]

63 శాతం కరోనా మరణాలు 60ఏళ్ల పైబడిన వారే: కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 6:44 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 30 మంది చనిపోయినట్లు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,067కి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇందులో 1445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధించినవేనని వివరించారు. ఇతర శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాగా.. భారత్ లోని అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 693 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో 63 శాతం మరణాలు 60 ఏళ్లు పైబడిన వారివేనని తెలిపారు. 40-60 మధ్య వయసు గల వారు 30శాతం మరణించగా.. 40 ఏళ్లలోపు మరణించిన వారి సంఖ్య 7 శాతంగా ఉందని తెలిపారు. మృతి చెందిన వారిలో 73 శాతం మంది పురుషులు కాగా.. 27 శాతం స్త్రీలు ఉన్నారని వివరించారు. మరణించిన వారిలో 86 శాతం మంది డయాబెటిస్‌, కిడ్నీ వ్యాధులు ఉన్నవారేనని పేర్కొన్నారు.