ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పసుపు కూడా అల్జీమర్స్ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆలివ్ ఆయిల్‌లో ఉండే మోనో అన్‌శాడురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తే అల్జీమర్స్ సమస్య దూరమవుతుంది
డార్క్ చాక్లెట్స్ కూడా అల్జీమర్స్ సమస్యను దరిచేరకుండా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ యాక్సిండెట్స్ మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచుతాయి.
అల్జీమర్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు వంటివి ఉండేలా చూసుకోవాలి.
వీటన్నింటితో పాటు ఒత్తిడి సైతం తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రతీ రోజూ కచ్చితంగా కొంతసేపైనా వ్యాయామం చేయాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం