పెద్దజీయంగార్ స్వామికి కొవిడ్ పాజిటివ్‌

కొవిడ్ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థాన్ని కుదిపేస్తోంది.  ఆలయంలో పనిచేస్తున్న 15 మంది అర్చకులతో సహా 140 మందికి కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి ...

పెద్దజీయంగార్ స్వామికి కొవిడ్ పాజిటివ్‌

Updated on: Jul 18, 2020 | 12:29 PM

Pedda Jeeyar Swamy Tested Covid Positive : కొవిడ్ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థాన్ని కుదిపేస్తోంది.  ఆలయంలో పనిచేస్తున్న 15 మంది అర్చకులతో సహా 140 మందికి కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయంగార్ స్వామికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు స్వామీవారిని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థానం పరిశీలిస్తోంది.

అర్చకులతో సహా 140 మందికి కరోనా సోకింది. ఇందులో టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ప్రసాదాలు తయారు సిబ్బంది ఉన్నారు. మొత్తం 50 మంది అర్చకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి నిర్ధారణ అయ్యింది. మరో 25 మందికి సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. కరోనా పాజిటివ్ వచ్చినవారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us