పింక్ రీమేక్ కోసం.. పవన్‌ కల్యాణ్‌ న్యూ లుక్..!

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లుక్‌ ఆకట్టుకొంటుంది. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ రాజకీయ రంగప్రవేశంతో వెండితెరకు దూరమయ్యారు. ఇంత వరకూ సినిమాల్లో నటించలేదు. అప్పటి నుంచి గుబురు గెడ్డంతో కనిపిస్తున్నారు పవన్‌. రెండేళ్ల విరామం అనంతరం ఆయన మూడు సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నారు. దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా అంగీకరించారు. ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ […]

పింక్ రీమేక్ కోసం.. పవన్‌ కల్యాణ్‌ న్యూ లుక్..!

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లుక్‌ ఆకట్టుకొంటుంది. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ రాజకీయ రంగప్రవేశంతో వెండితెరకు దూరమయ్యారు. ఇంత వరకూ సినిమాల్లో నటించలేదు. అప్పటి నుంచి గుబురు గెడ్డంతో కనిపిస్తున్నారు పవన్‌. రెండేళ్ల విరామం అనంతరం ఆయన మూడు సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నారు. దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా అంగీకరించారు. ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రిమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు.

పాణ్యం నియోజవర్గ క్రియాశీలక కార్యకర్తలతో జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గురువారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. సమావేశానికి ఆయన గడ్డం లేకుండా గుబురు మీసాలు, ఒత్తైన జుట్టుతో వచ్చారు. దీంతో రెండేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ను గడ్డం లేకుండా చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పింక్‌ రిమేక్‌ చిత్రానికి ‘లాయర్‌ సాబ్‌’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా దిల్‌ రాజు నిర్మాత. మే 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

[svt-event date=”07/02/2020,2:15AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Click on your DTH Provider to Add TV9 Telugu