కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

కెసీఆర్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇస్తున్న ఆర్థికసహాయం ఏమాత్రం సరిపోదని.. దాన్ని 5 వేల రూపాయలకు పెంచాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం పేదలకు పంపిణీ చేయాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కోరారు.

కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:54 PM

కెసీఆర్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇస్తున్న ఆర్థికసహాయం ఏమాత్రం సరిపోదని.. దాన్ని 5 వేల రూపాయలకు పెంచాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం పేదలకు పంపిణీ చేయాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కోరారు. గురువారం ఉదయం సోమేష్ కుమార్ అఖిలపక్ష నేతలతో హైదరాబాద్ బి.ఆర్.కె. భవన్‌లో భేటీ అయ్యారు.

ఈ అఖిలపక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను చర్చించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఖిలపక్ష నేతలకు వివరించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిణామాలను సమావేశం చర్చించింది. ధాన్యం సేకరణలో రైతాంగం పడుతున్న ఇబ్బందులను అఖిలపక్ష నేతలు సోమేష్ కుమార్‌కు వివరించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపై విపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 80 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తే తెలంగాణలో 20 వేలకు మించి పరీక్షలు ఎందుకు చేయలేదని అఖిలపక్ష నేతలు నిలదీశారు. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పదిహేను వందల రూపాయలు ఏమాత్రం సరిపోవని ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ సీఎస్‌ను కోరారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతాంగాన్ని మార్కెటింగ్ అధికారులు మోసం చేస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మొత్తం డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలలో వున్న తెలంగాణ వారిని రాష్ట్రానికి తీసుకు రావాలని టీ.టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని టీజేఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ