Nirmal Dog: పెంపుడు కుక్కపై ఎంత ప్రేమో.. కుక్క పిల్లలకు పురుడు నిర్వహించి, ఊరంతా భోజనాలు పెట్టిన యజమాని..

Nirmal Dog: కొందరు వ్యక్తులు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే ఏమాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో మనుషులకు ఉండే

Nirmal Dog: పెంపుడు కుక్కపై ఎంత ప్రేమో.. కుక్క పిల్లలకు పురుడు నిర్వహించి, ఊరంతా భోజనాలు పెట్టిన యజమాని..
Dogs
Follow us

|

Updated on: Nov 08, 2021 | 9:45 AM

Nirmal Dog: కొందరు వ్యక్తులు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే ఏమాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో మనుషులకు ఉండే ప్రేమ పీక్స్ అని చెప్పాలి. మనుషులకు, కుక్కలకు ఏదో తెలియని అఫెక్షన్ ఉంటుంది. వ్యక్తులు తమ పెంపుడు కుక్కల పట్ల అమితమైన ప్రేమ కనబరుస్తారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని అనంతపేట గ్రామంలో భూమా, సుశీల అనే అక్కాచెల్లెళ్ల ఇంట్లో వారి పెంపుడు కుక్క డెలివరీ అయ్యింది. దాంతో ఆ వారు తమ శునకానికి పురుడు నిర్వహించారు. అంతేకాదండోయ్.. పురుడు సందర్భంగా గ్రామస్తులను పిలిచి విందు భోజనం ఏర్పాటు చేశారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపేట గ్రామంలో 3 రోజుల క్రితం పెంపుడు కుక్క ప్రసవించింది. దాంతో ఆ ఇంటి వారు కుక్క పిల్లలకు పురుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మనుషులకు పురుడు, బారసాల ఎలా చేస్తారో.. అచ్చంగా కుక్కలకు కూడా అలాగే చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను పిలిచి వారికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా, మనుషులకు నిర్వహించే కార్యక్రమం.. పెంపుడు కుక్కు కూడా నిర్వహించడంతో వింతగా చూస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. మొత్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనులు.. ఆ కుక్కను, కుక్క పిల్లలను గ్రామస్తులు ఆశీర్వదించి, యజమాని ఇచ్చిన విందు భోజనాన్ని ఆరగించి సంతృప్తిగా వెళ్లారు.