ఢిల్లీ…జర్నలిస్టుపై హత్యాయత్నం.. దుండగుల అరెస్ట్

ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో  సోమవారం రాత్రి విక్రమ్ జోషీ అనే జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. తన ఇద్దరు కూతుళ్లతో ఆయన బైక్ పై ఇంటికి వస్తుండగా అయిదుగురు దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషీ తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు ఆయనను ఓ కారు వద్దకు లాగి అక్కడ కూడా దాడికి పాల్పడ్డారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తమ కళ్ళముందే తమ తండ్రిపై జరిగిన ఈ ఘటనతో […]

ఢిల్లీ...జర్నలిస్టుపై హత్యాయత్నం.. దుండగుల అరెస్ట్

Edited By:

Updated on: Jul 21, 2020 | 11:49 AM

ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో  సోమవారం రాత్రి విక్రమ్ జోషీ అనే జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. తన ఇద్దరు కూతుళ్లతో ఆయన బైక్ పై ఇంటికి వస్తుండగా అయిదుగురు దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషీ తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు ఆయనను ఓ కారు వద్దకు లాగి అక్కడ కూడా దాడికి పాల్పడ్డారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తమ కళ్ళముందే తమ తండ్రిపై జరిగిన ఈ ఘటనతో చిన్నారులైన ఆయన కుమార్తెలు భయపడిపోయారు. స్థానికులు వారిని బుజ్జగించి.. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని గంటల్లోనే దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. తన మేనకోడలిని వేధించిన కొందరు వ్యక్తులపై ఇటీవల విక్రమ్ జోషీ ఫిర్యాదు చేసిన కారణంగానే… కక్షతో వారే ఈ ఎటాక్ కి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us