Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు

|

Apr 21, 2022 | 7:07 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన యాదాద్రి(Yadadri) ఆలయం పునరుద్ఘాటన జరుపుకున్న విషయం తెలిసిందే. స్వామివారి స్వయంభు దర్శనానికి భక్తులు తరలివెళ్తున్నారు. అయితే మహాలయ సమీపంలో పునర్నిర్మితమైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి....

Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు
Yadadri
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన యాదాద్రి(Yadadri) ఆలయం పునరుద్ఘాటన జరుపుకున్న విషయం తెలిసిందే. స్వామివారి స్వయంభు దర్శనానికి భక్తులు తరలివెళ్తున్నారు. అయితే మహాలయ సమీపంలో పునర్నిర్మితమైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ(Rama Lingeshwara Swamy Temple) ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. నేటి నుంచి ప్రారంభమైన శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయని ఈవో గీత తెలిపారు. శ్రీరాంపురం (తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి సూచనలతో ప్రతిష్ఠ పర్వాన్ని నిర్వహించనున్నారు. 21న ఉదయం యాగశాల ప్రవేశం, మండప, స్తంభ ద్వారతోరణ పూజ, చతుస్థానార్చనలు, హోమకుండ సంస్కారం, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్రానుష్ఠానం, హవనం. సాయంత్రం శాంతి దీక్షాహోమ, కౌతుక బంధనం, జలాధివాసం, 22న స్థాపిదేవతాయజన, మూలమంత్రానుష్ఠానం, బలిహరణం, సాయంత్రం స్నపనం, అర్చన, దేవతాహవనం, వేదహవనం, నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.

ఈనెల 25న ఉదయం ఏడు గంటల నుంచి శివాలయ ప్రతిష్ఠ పర్వాలు ప్రారంభమవుతాయి. మాధవానంద సరస్వతీస్వామి నేతృత్వంలో రామలింగేశ్వరస్వామి స్పటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధనం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్ర హోమం, క్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30కి మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం నిర్వహించాక శ్రీ స్వామి అనుగ్రహ భాషణం జరుగుతుందని ఈవో వివరించారు. పునరుద్ఘాటనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read

Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన

Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!

IPL 2022: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్