అమర్‌నాథ్ యాత్రికుల్లారా.. భయపడకండి

అమర్‌నాథ్ యాత్రికులకు ఎలాంటి హాని జరగదని.. వారు భయపడాల్సిన అవసరం లేదని కశ్మీర్ వేర్పాటువాదులు హామీ ఇచ్చారు. ఈ మేరకు వేర్పాటువాద సంస్థ జాయింట్ రెసిస్టెంట్ లీడర్‌షిప్ సంస్థ నాయకులు మాట్లాడుతూ.. అమర్‌నాథ్ యాత్రికులకు కశ్మీర్‌ లోయలో హాని ఉందని పలు ఛానెళ్లు అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు. కశ్మీర్‌కు వచ్చిన యాత్రికులు క్షేమంగా ఉంటారని వారు పేర్కొన్నారు అలాగే ‘‘ఎలాంటి పరిస్థితి ఎదురైనా, కష్టకాలంలో ఉన్నా కశ్మీర్‌ లోయలో నివసించే ప్రజలు ఆతిథ్యం విషయంలో ఎప్పుడూ […]

అమర్‌నాథ్ యాత్రికుల్లారా.. భయపడకండి
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 4:13 PM

అమర్‌నాథ్ యాత్రికులకు ఎలాంటి హాని జరగదని.. వారు భయపడాల్సిన అవసరం లేదని కశ్మీర్ వేర్పాటువాదులు హామీ ఇచ్చారు. ఈ మేరకు వేర్పాటువాద సంస్థ జాయింట్ రెసిస్టెంట్ లీడర్‌షిప్ సంస్థ నాయకులు మాట్లాడుతూ.. అమర్‌నాథ్ యాత్రికులకు కశ్మీర్‌ లోయలో హాని ఉందని పలు ఛానెళ్లు అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు. కశ్మీర్‌కు వచ్చిన యాత్రికులు క్షేమంగా ఉంటారని వారు పేర్కొన్నారు

అలాగే ‘‘ఎలాంటి పరిస్థితి ఎదురైనా, కష్టకాలంలో ఉన్నా కశ్మీర్‌ లోయలో నివసించే ప్రజలు ఆతిథ్యం విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. అది పర్యాటకులైనా.. అమర్‌నాథ్ యాత్రికుడైనా.. కశ్మీర్‌కు ఎవ్వరు వచ్చినా వారికి ఎలాంటి హాని చేయం’’ అంటూ ఓ స్టేట్‌మెంట్‌లోనూ పేర్కొన్నారు. కాగా జూలై 1 నుంచి అమర్‌నాథ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.