ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కొత్త వైరస్.. మరోసారి అంక్షల దిశగా అయా దేశాలు

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కొత్త వైరస్.. మరోసారి అంక్షల దిశగా అయా దేశాలు

ఏడాది పాటు నిర్విరామంగా సాగిన ప్రయోగాలతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంతలో.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే పలు దేశాలకు విస్తరించింది

Balaraju Goud

|

Jan 03, 2021 | 1:45 PM

New Variant Strain Virus: ప్రపంచ వ్యాప్తంగా అంతలాకుతం చేసిన కరోనా మహమ్మారిని అంతం చేసే సమయం ఆసన్నమైంది. ఏడాది పాటు నిర్విరామంగా సాగిన ప్రయోగాలతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంతలో.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే పలు దేశాలకు విస్తరించింది. చైనా కోవిడ్ వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తూ మరోసారి కలవరానికి గురిచేస్తోంది. రోజుకో దేశంలో ఈ రకం వెలుగులోకి వస్తూనే ఉంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. రాకపోకలపై ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దుతో పాటు అవసమైన చోట లాక్‌డౌన్‌లు విధించడంలో వేగంగా స్పందించాయి.

ఇప్పటి వరకు ఈ మహమ్మారి 30 దేశాల్లో వెలుగు చూసింది. తాజాగా వియత్నాంతో శనివారం తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన ఓ మహిళలో ఈ కొత్త రకం వైరస్‌ను గుర్తించారు. వెంటనే ఆమెను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు శుక్రవారం టర్కీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. వీరంతా యూకే నుంచి తిరిగొచ్చిన వారిగా గుర్తించారు. ఇదే తరహాలో చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను రద్దు చేసుకున్నాయి. ఇక మన దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 29 కేసులు నిర్ధారణ కాగా.. వారిని ఐసోలేషన్‌కు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇక, విదేశీ ప్రయాణాలపై అంక్షలు విధించారు. విమాన సర్వీసులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇక, కరోనా మమ్మారితో దిక్కుతోచనిస్థితిలో ఉన్న అగ్రరాజ్యంపై కొత్త వైరస్ మరింత కలవరానికి గురిచేస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నామని వెల్లడించారు.

ఇక కొత్తరకానికి కేంద్రంగా ఉన్న బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్‌ పార్క్‌లు పూర్తిగా మూసివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్‌లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి వైరస్ ముప్పు పొంచి ఉందని అక్కడి హెల్త్‌ సర్వీసెస్‌ సీఈవో పాల్‌ రేడ్‌ హెచ్చరించారు. కాగా, ఈ కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి మరో విడత విజృంభణకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu