Jagan super plan: నీటి కొరతనెదుర్కొనేందుకు జగన్ కొత్త ప్లాన్

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమవుతున్న నీటి కొరత, పారిశ్రామిక రంగానికి భవిష్యత్తులో భారీ నీటి అవసరాలు.. ఇలా కీలకాంశాలను అడ్రస్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇందుకోసం ఆధునాతన టెక్నాలజీ వాడుకునేందుకు బుధవారం కీలక సమావేశం నిర్వహించారు.

Jagan super plan: నీటి కొరతనెదుర్కొనేందుకు జగన్ కొత్త ప్లాన్
Follow us

|

Updated on: Feb 26, 2020 | 5:37 PM

Jagan govt to go with desalination for drinking water: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమవుతున్న తాగునీటి కొరత శాశ్వత నివారణకు జగన్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఇజ్రాయిల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ దిశగా బుధవారం ప్రభుత్వం చర్చలకు శ్రీకారం చుట్టింది.

ఇదీ చదవండి: జీవో 107పై మడతపేచీ.. రేపట్నించి టీడీపీ ప్లాన్ ఇదే

రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేసి, వినియోగించడంపై కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో బుధవారం ఇజ్రాయెల్‌ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో భీటీలో ఐడీఈ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. పలు కీలకాంశాలను ప్రస్తావించారు.

ఇదీ చదవండి: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

మంచినీటిని ఒక్క బొట్టుకూడా వృథాచేయకూడదు, అందుకనే డీశాలినేషన్‌ నీటిపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇజ్రాయెల్‌ మొత్తం డీ శాలినేషన్‌ నీటినే వినియోగిస్తోందని, పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్‌ నీటినే వినియోగించాలని తాము భావిస్తున్నట్లు జగన్ తెలిపారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాల కోసం కూడా డీశానినేటెడ్ నీటిని వినియోగించే పరిస్థితి ఉండాలని సీఎం అన్నారు.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

ఎక్కడెక్కడ డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టాలి అన్నదానిపై అధ్యయనం చేసి, ఆమేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరిన సీఎం.. మొదట విశాఖపట్నంతో ప్రారంభించి.. దశలవారీగా దీన్ని విస్తరించుకుంటూ వెళ్లాలని సూచించారు. విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ నీటినే వినియోగించేలా చూడాలన్నారు. విశాఖపట్నం స్టీల్‌ పాంట్‌కు డీశాలినేషన్‌ లేదా శుద్ధిచేసిన నీటినే వాడేలా చూడాలని, అలాగే రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లు కూడా డీ శాలినేషన్‌ నీటిని వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని అన్నారు.

Read this also: ట్రంప్ డిన్నర్‌కు జగన్‌ని ఎందుకు పిలవలేదో చెప్పేసిన బొత్స

ఈ సందర్బంగా డీశాలినేషన్ విధానం గురించి ఇజ్రాయిల్ ప్రతినిధులు వివరించారు. 1964లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంటును ఇజ్రాయెల్‌లో ప్రారంభించామని తెలిపారు. ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, 4 దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. భారత్‌తోపాటు, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని, భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఎస్సార్, రిలయన్స్‌ కంపెనీల్లో ఇండస్ట్రియల్‌ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుద్ధిచేసిన మురుగునీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: రెండు లారీల మధ్య ఇరుక్కున్న బతికిపోయిన లక్కీ ఫెల్లో