డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్సీబీ నోటీసులు

|

Sep 22, 2020 | 12:11 PM

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత బాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. సుశాంత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగింది

డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్సీబీ నోటీసులు
Follow us on

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత బాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. సుశాంత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు అంటుకుంది. మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపికా ఎన్సీబీ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలంపై ఎన్సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అసలు సినీ పరిశ్రమలోకి నిషేధిత డ్రగ్స్‌ ఎలా వచ్చింది. డ్రగ్స్ సరఫరా చేసిన మాఫియా కూపీ లాగేందుకు విచారణ చేపట్టారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని కనిపెట్టే పనిలో పడింది ఎన్సీబీ. పాక్‌, పంజాబ్‌ తదితర ప్రాంతాల నుంచి డ్రగ్స్ దేశ ఆర్థిక రాజధానిలోకి ప్రవేశించడంపై ఆరా తీస్తోంది. డ్రగ్స్‌ కేసులో ప్రస్తావనకు వచ్చిన డి, కె అనే ఆంగ్ల అక్షరాల్లో డి అంటే దీపికా పదుకొణె అని, కె అంటే ఆమె మేనేజర్‌ కరిష్మా అని భావిస్తున్నారు. కాగా వీరిని మంగళవారం ప్రశ్నిస్తారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి

ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌ తన స్టైలులో ఘాటూ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘‘రిపీట్‌ ఆఫ్టర్‌ మీ, డిప్రెషన్ డ్రగ్స్‌ వాడకం వల్ల సంభవించే ఫలితం. హై సొసైటీకి చెందిన ధనవంతులైన స్టార్‌ కిడ్స్.. తమను తాము హుందాతో కూడిన వ్యక్తులుగా, మంచి పెంపకంలో పెరిగిన వారిగా అభివర్ణించుకుంటారు. అయితే, వీరు తమ మేనేజర్‌ని ‘మాల్‌ హై క్యా..’ అని అడుగుతారు’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘రిపీట్‌ ఆప్టర్‌ మీ..’’ అంటూ దీపిక గతంలో డిప్రెషన్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనితో కంగన పోస్టు దీపికాతో సహా శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను ఉద్దేశించి చేసినట్లు తెలుస్తోంది.