అంతరిక్ష పర్యాటక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఇక సిద్ధంకండి..!

మానవుడు తలచుకుంటే ఎదైనా సాధ్యమవుతుందనడానికి మరో సారి రుజువైంది. రోదసి ప్రయోగాల్లోకి తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ అడుగుపెట్టింది. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అండ్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూడ్‌ స్పేస్‌ లాంచ్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. కానీ అనుకొని పరిస్థితుల వల్ల వాయిదా. వాతావరణ మార్పుల కారణంగా శనివారానికి వాయిదా వేస్తున్నట్లు నాసా అధికారులు ప్రకటించారు. నాసాకు చెందిన ఇద్దరు […]

అంతరిక్ష పర్యాటక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఇక సిద్ధంకండి..!

Updated on: May 28, 2020 | 4:05 PM

మానవుడు తలచుకుంటే ఎదైనా సాధ్యమవుతుందనడానికి మరో సారి రుజువైంది. రోదసి ప్రయోగాల్లోకి తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ అడుగుపెట్టింది. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అండ్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూడ్‌ స్పేస్‌ లాంచ్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. కానీ అనుకొని పరిస్థితుల వల్ల వాయిదా. వాతావరణ మార్పుల కారణంగా శనివారానికి వాయిదా వేస్తున్నట్లు నాసా అధికారులు ప్రకటించారు. నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాముల్ని రోదసిలోకి పంపించే ఘట్టాన్ని ‘స్పేస్‌ఎక్స్‌’ పూర్తిచేసింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం.. గురువారం వేకువజామున 2.03 గంటలకు ఈ ప్రయోగం జరిగాల్సి ఉంది. ‘ఫాల్కన్‌ 9’ రాకెట్‌ ద్వారా నాసాకు చెందిన వ్యోమగాములు బాబ్‌ బెంకన్‌, డగ్లస్‌ హర్లే రోదసిలోకి వెళ్లనున్నట్లు నాసా అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి దాదాపు రూ. 60,586 కోట్లు ఖర్చయినట్టు అంచనా. ప్రస్తుతం ‘స్పేస్‌ఎక్స్‌’ వంటి ప్రైవేటు సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లోకి ప్రవేశించడంతో ‘స్పేస్‌ టూరిజం’ కూడా ఈజీ కానుంది. శనివారం ప్రయోగం విజయవంతమైతే ఇక అంతరిక్షం పర్యాటక కేంద్రంగా మారునుంది