Sam Jam Season Finale: వారిద్దరూ కలిస్తే సూపర్ హిట్టేగా.. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘చైయ్-సామ్’ ప్రోమో

|

Jan 05, 2021 | 1:03 PM

సూపర్‌ హిట్ సామ్‌ జామ్‌ షో క్లైమాక్స్‌ కు వచ్చేసింది. సినిమా అయినా, షో అయినా కమర్షియల్ ఎండింగ్ లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఫైనల్ ఎపిసోడ్‌కు సమంత భర్త‌, హీరో నాగ చైతన్య...

Sam Jam Season Finale: వారిద్దరూ కలిస్తే సూపర్ హిట్టేగా.. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా చైయ్-సామ్ ప్రోమో
Follow us on

Sam Jam Season Finale:  సూపర్‌ హిట్ సామ్‌ జామ్‌ షో క్లైమాక్స్‌ కు వచ్చేసింది. సినిమా అయినా, షో అయినా కమర్షియల్ ఎండింగ్ లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఫైనల్ ఎపిసోడ్‌కు సమంత భర్త‌, హీరో నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చారు. మామూలు హీరోలతోనే అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్‌ ఇచ్చిన సామ్‌…చైతూతో మోర్‌ అండ్‌ మోర్‌ ఫన్‌ అనిపించేలా గేమ్‌ ప్లాన్ చేశారు. మాములుగా ఇంటర్వ్యూలు అంటే చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు చైతన్య. గతంలో ఏ స్టేజ్‌ మీదా కనిపించనంత జోవియల్‌గా సామ్‌ జామ్‌ స్టేజ్‌ మీద కనిపించారు చైతూ. ఇంటి విషయాల గురించి కూడా సరదా సరదాగా మాట్లాడుతూనే సమంత మీద సెటైర్స్‌ పేల్చారు చైతూ. టీజర్‌లోనే ఈ రేంజ్‌ ఎంటర్‌టైన్మెంట్ ఉందంటే షో ఇంకో రేంజ్‌లో ఉంటుందనిపిస్తోంది. ఫుల్‌ ఎపిసోడ్‌ జనవరి 8న ఆహా యాప్‌లో ప్రీమియర్‌ కానుంది.

తొలిసారిగా ఆహా కోసం హోస్ట్‌గా మారిన సమంత, సామ్‌ జామ్‌ షోతో డిజిటల్‌లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. చిరంజీవి లాంటి టాప్ స్టార్స్‌ నుంచి విజయ్‌ దేవరకొండ లాంటి యంగ్‌ సెన్సేషన్స్‌ను ఇంటర్వ్యూ చేశారు సమంత. ఈ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఇప్పటికే స్ట్రీమ్ కాగా.. ఎనిమిదో ఎపిసోడ్‌లో చైయ్ కనిపించనున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియోలో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా దూసుకుపోతుంది.

 

Also Read :

జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం