రైలు వచ్చింది రమ్మన్నారు.. తీరా లేదు పొమ్మన్నారు..!

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అవస్థలు పడ్డారు. దీంతో సొంతూర్లకు వెళ్లేందుకు రైలు వేస్తున్నాం రామన్నారు ఒకరు. తీరా వెళ్లాక రైలు లేదు పొమ్మన్నారు మరోకరు. డబ్బులేని కాలంలో కింద మీద పడి రైల్వే స్టేషన్ కి చేరిన వారికి నిరాశే ఎదురైంది. అధికారుల సమన్వయ లోపంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు ముంబై వలస కార్మికులు. కరోనా దెబ్బకి వలసకూలీలు విలవిలలాడుతున్నారు. స్వస్ధలాలకు చేరేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముంబై నుంచి తమ గ్రామాలకు […]

రైలు వచ్చింది రమ్మన్నారు.. తీరా లేదు పొమ్మన్నారు..!
Follow us

|

Updated on: May 21, 2020 | 7:40 PM

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అవస్థలు పడ్డారు. దీంతో సొంతూర్లకు వెళ్లేందుకు రైలు వేస్తున్నాం రామన్నారు ఒకరు. తీరా వెళ్లాక రైలు లేదు పొమ్మన్నారు మరోకరు. డబ్బులేని కాలంలో కింద మీద పడి రైల్వే స్టేషన్ కి చేరిన వారికి నిరాశే ఎదురైంది. అధికారుల సమన్వయ లోపంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు ముంబై వలస కార్మికులు. కరోనా దెబ్బకి వలసకూలీలు విలవిలలాడుతున్నారు. స్వస్ధలాలకు చేరేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముంబై నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు శుక్రవారం రైళ్ల కోసం వేచిచూసిన వేలాది మంది వలస కూలీలకు అధికారుల మధ్య సమన్వయ లోపం నిరాశపర్చింది. వలస కూలీలు వెళ్లాల్సిన రైలు బొరివలి స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని సమాచారం ఇచ్చారు ముంబై పోలీసులు. అందరూ కందివలిలో ప్రభుత్వ మైదానానికి చేరుకోవాలని సూచించారు. దీంతో వ్యయప్రయాసలకు ఒడ్చి ఆ ప్రాంతానికి చేరుకున్న వలస కార్మికులకు నిరాశే ఎదురైంది. యూపీకి వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయని మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు రైళ్లు ఏవీ రద్దవలేదని రైల్వే అధికారులు చెప్పడం వలస కూలీలను అయోమయంలో పడేసింది. అధికారుల నిర్వాకంతో వలస కూలీలు భగ్గుమన్నారు. తమ వద్ద చేతిలో చిల్లిగవ్వ లేదని ఇక్కడ నుంచి తిరిగి ఎలా వెళతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు దొరికేవరకూ రైల్వేస్టేషన్‌లోనే ఉంటామంటూ భీష్మించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో.. అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Latest Articles
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌