మన దేశంలోని టాప్‌ 10 యూనివర్సిటీలు ఇవే..

May 26, 2024

TV9 Telugu

TV9 Telugu

NIRF 2023 ర్యాంకింగ్ 2023 ప్రకారం మన దేశంలోని టాప్ 10 యూనివర్సిటీలు ఇవే. ఈ ర్యాంకింగ్స్‌లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రథమ స్థానంలో నిలిచింది

TV9 Telugu

ర్యాంక్ 2లో ఉన్న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, పరిశోధనలలో అకడమిక్ ఎక్సలెన్స్‌గా ప్రసిద్ధి చెందింది

TV9 Telugu

ర్యాంక్ 3లో ఉన్న న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మొదట్లో అలీఘర్‌లో ఉండేది. 1925లో ఢిల్లీకి మార్చారు. ఇందులో 44 విభాగాల్లో వివిధ విద్యాపరమైన, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లను  అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 4లో ఉన్న కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, సాంఘిక శాస్త్రాలతో సహా వివిధ విభాగాలలో అనేక రకాల కోర్సులను అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 5లో ఉన్న వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో సైన్స్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, బిజినెస్ & మేనేజ్‌మెంట్ స్టడీస్ మొదలైన విభాగాలలో విస్తృత శ్రేణిలో యూజీ, పీజీ కోర్సులను అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 6లో ఉన్న కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)లో మెడిసిన్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌తో సహా వివిధ విభాగాలలో విస్తృత శ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 7లో ఉన్న తమిళనాడులోని అమృత విశ్వ విద్యాపీఠం మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ఐదు క్యాంపస్‌లలో ఉంది. ఇందులో 120 కంటే ఎక్కువ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 8లో ఉన్న తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. భోపాల్, చెన్నై, అమరావతి, దుబాయ్, మలేషియాలో దీని క్యాంపస్‌లు ఉన్నాయి. ఇది వివిధ విభాగాలలో విస్తృత శ్రేణి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది

TV9 Telugu

ర్యాంక్ 9లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (అలీఘర్), ర్యాంక్ 10లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (తెలంగాణ).. యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో విస్తృత శ్రేణిలో కోర్సులు అందిస్తుంది