గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అవకాడో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు దరిచేరకుండా చూస్తాయి
అవకాడోలు ఫైబర్‌కు పెట్టింది పేరు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మెరుగైన జీర్ణక్రియను సొంతం చేసుకోవచ్చు. ప్రతీరోజూ అవకాడో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా అవకాడో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని లుటిన్, జియాక్సంతిన్‌లు కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
అవకాడాలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బీపీని కంట్రోల్ చేయడంలో కూడా అవకాడో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం రక్తనాళాల సంకోచాన్ని సరిచేసి రక్తనాళాలను విస్తరిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి అవకాడో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం ఈజీగా అవుతుంది.
గర్భిణీలకు అవకాడలో ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి గర్భిణీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.