గంధం చర్మ సమస్యలకు ఓ వరం..

TV9 Telugu

26 May 2024

గంధం చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి మొటిమలను దూరం చేస్తుంది.

ఒక టీస్పూన్ గంధంలో నూనె, చిటికెడు పసుపు, కర్పూరం కలిపి ముఖానికి రాసుకోని రాత్రాంత ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్లమచ్చలు పోతాయి.

తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాల వల్ల చందనం.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  టాన్ తొలగించడానికి ఇది సమర్థవంతమైనది.

ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, కొబ్బరి నూనె కలిపి ముఖానికి మసాజ్ చేసి రాత్రంతా ఉంచితే డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

గంధపు చెక్కలో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది చర్మ ముడుతలను నివారించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. దీని కోసం, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, 2 టేబుల్ స్పూన్ల గంధం కలపి రాసి 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగితే చాలు.

ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, కొన్ని చుక్కల గంధం నూనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాలు తర్వాత కడిగితే చర్మం నిగారింపుగా మారుతుంది.

అర టీస్పూన్ గంధం పొడి, కొంచెం టమోటా రసం, అర టీస్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా కలిపి ఫేస్ పై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేస్తే జిడ్డు పోతుంది.