ఫలించిన అధికారుల కృషి… ఆసియాలో అతి పెద్ద మురికివాడ ధారవి సరికొత్త రికార్డు.

|

Dec 25, 2020 | 8:52 PM

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతం, అసలు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కానీ ప్రదేశం.. ముంబై మురికివాడ ధారవి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఫలించిన అధికారుల కృషి... ఆసియాలో అతి పెద్ద మురికివాడ ధారవి సరికొత్త రికార్డు.
Follow us on

Mumbai dharavi creats new record: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతం, అసలు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కానీ ప్రదేశం.. ముంబై మురికివాడ ధారవి సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ ఏడాది జూలై 26న ధారవిలో తొలిసారి రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. అప్పటి నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
దీంతో అధికారులు ధారవిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అత్యంత జనసాంధ్రత ఉన్న ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. పటిష్ట చర్యలు చేపట్టారు. వందల సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలతో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు పాజిటివ్ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. ఇక పబ్లిక్ టాయిలెట్స్ వద్ద కూడా శానిటైజేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇలా అధికారులు, పారిశుధ్య కార్మికుల కృషి ఫలితంగా నేడు ధారవి కరోనాను జయించింది. గురువారం రెండు కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.